మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ.. సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్?

praveen
ఇటీవల కాలంలో భారత జట్టులో చోటు సంపాదించుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు.. తమ ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. దేశవాళి క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసి ఇక టీమిండియాలోకి వస్తున్న ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండానే ప్రదర్శన చేయగలుగుతున్నారు. అయితే ఇటీవలే సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్.. తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన చేశాడు అని చెప్పాలి..




 43 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 55 పరుగులు చేశాడు సాయి సుదర్శన్. సఫారీలు నిర్దేశించిన 117 పరుగుల లక్ష్య చేదనలో సాయి సుదర్శన్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి రెండో వికెట్ కి 88 పరుగులు జోడించి టీమిండియా ఈజీగా విక్టరీ సాధించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో అతనికి మొదటి మ్యాచ్ అయినప్పటికీ.. తడబడకుండా అరంగేట్రం మ్యాచ్లోనే అర్థ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే సాయి సుదర్శన్ ఒక అరుదైన రికార్డును కూడా తన పేరుతో లికించుకున్నాడు.


 టీమిండియా తరఫున ఆడిన తొలి వన్డే మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించిన వారిలో 17వ బ్యాట్స్మెన్ గా నిలిచాడు సాయి సుదర్శన్. ఇక ఓపెనర్ గా ఇలా టీమిండియా తరఫున మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. గతంలో రాబిన్ ఉతప్ప, కేఎల్ రాహుల్, రియాజ్ లు ఆడిన తొలి వన్ డే లోనే ఓపెనర్లుగా 50 ప్లస్ స్టోర్ చేశారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఈ తమిళనాడుకు చెందిన యంగ్ సెన్సేషన్ బ్యాట్స్మెన్ కూడా చెలరేగిపోయాడు. గత కొంతకాలం నుంచి దేశవాళీ టోర్నీలలో మంచి ప్రదర్శన చేస్తున్న సాయి సుదర్శన్.. ఇక ఇటీవలే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున కూడా అదరగొట్టి అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: