కెప్టెన్ గా కేఎల్ రాహుల్.. అరుదైన రికార్డ్?
ఏకంగా సౌత్ ఆఫ్రికా గడ్డపై ఉండే బౌన్సి పిచ్ లపై సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు చెలరేగిపోతూ ఉంటారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అలాంటి సౌత్ఆఫ్రికాను వారి సొంత గడ్డమీద ఇటీవల టీమిండియా జట్టు ఓడించి అదరగొట్టేసింది. ఏకంగా భారత బౌలర్లు చెలరేగి పోవడంతో 116 పరుగులకే కుప్పకూలిపోయింది సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్ విభాగం ఇక ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని అలవోకుగా చేదించి మొదటి మ్యాచ్లో ఘనవిజయాన్ని అందుకుంది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ కి కేఎల్ రాహుల్ సారధిగా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ గా రాహుల్ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు.
ఇప్పుడు వరకు ఎన్నోసార్లు పింక్ జెర్సీలో బరిలోకి దిగింది సౌత్ ఆఫ్రికా. ఇలా పింకు జెర్సీలో బరిలోకి దిగిన ఎన్నడూ కూడా ఓడిపోలేదు. అరవీర భయంకరమైన ప్రదర్శన చేసింది. కానీ మొదటిసారి ఆ జట్టుకు పింక్ జెర్సీలో పరాజయం ఎదురైంది. ఇలా పింక్ జెర్సీలో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టుపై వన్డే మ్యాచ్ లో విజయం సాధించిన తొలి భారతీయ కెప్టెన్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. సాధారణంగా అయితే పింక్ జెర్సీలో మ్యాచ్ అంటే చెలరేగి ఆడే సఫారీలు ఇటీవల భారత్తో జరిగిన మ్యాచ్లో మాత్రం చతికిలబడ్డారు. దీంతో సౌత్ ఆఫ్రికా చేసిన 116 పరుగుల టార్గెట్ ను ఎంతో అలవోకగా బద్దలు కొట్టింది టీమిండియా.