రోహిత్ శర్మను.. కెప్టెన్ గా తప్పించడంలో తప్పేముంది : ఏబిడి

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసిన ఒకే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అదే రోహిత్ శర్మను సారథిగా తొలగించడం గురించి.. ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా అవతరించింది అంటే అది కేవలం రోహిత్ కెప్టెన్సీ వళ్లే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అప్పటివరకు ఎంతోమంది లెజెండ్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వహించారు. కానీ ఒక్కరు కూడా టైటిల్ అందించలేకపోయారు అని చెప్పాలి.

 కానీ ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఐదు సార్లు ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్గా నిలిపాడు. దీంతో ఇక ఐపీఎల్ హిస్టరీలోనే ముంబై ఒక దిగ్గజ జట్టుగా మారిపోయింది. దీనికంతటికీ కారణం హార్దిక్ కెప్టెన్సీ అని చెప్పాలి. కానీ ఇక రోహిత్ శర్మను ఇటీవల ముంబై ఇండియన్స్ సడన్ గా కెప్టెన్సీ నుంచి తప్పించింది. కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు బాధ్యతలను అప్పగించింది. దీంతో ఇలా సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ ని తప్పించడం ఏంటి అని అభిమానుల దగ్గర నుంచి మాజీ ఆటగాళ్ళ వరకు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఇలాంటి సమయంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పిస్తే తప్పు ఏంటి అని అటు సౌత్ ఆఫ్రికా దిగ్గజ ప్లేయర్ ఎ బి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి  చాలామంది ఈ కెప్టెన్సీ మార్పును పర్సనల్గా తీసుకుంటున్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేయడం చెత్త నిర్ణయం అని నేను భావించను. రోహిత్ గ్రేట్ కెప్టెన్. భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న అతడు ఐపీఎల్లో ఒత్తిడిని తగ్గించుకొని ఆటను ఆస్వాదించాలని అనుకుని ఉంటాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఒక ట్రోఫీ గెలిస్తే ప్రతికూలత పూర్తిగా తగ్గి అవకాశం ఉంది అంటూ ఏబి డివిలియర్స్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: