రజిని కొత్త ప్రాజెక్టుపై.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్?

praveen
సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు రజినీకాంత్. భాషతో సంబంధం లేకుండా తన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతమైన రజనీకాంత్ జైలర్ అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతలా కలెక్షన్ల వర్షం కురిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఇక ఇప్పుడు రజనీకాంత్ చేస్తున్న సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

 ఏకంగా తన సినిమాలతో సెన్సేషన్ సృష్టిస్తున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రజినీకాంత్. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుందో అని ఆడియన్స్ అందరూ కూడా తెగ ఎక్సైట్ అయిపోతున్నారు అని చెప్పాలి. రజనీకాంత్ కెరీర్ లో 171వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతూ ఉంది. అయితే ఈ సినిమా విషయంలో తాను మొదటి నుంచి చాలా టెన్షన్ గా ఉన్నాను అంటూ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందని.. ఇటీవల తెలిపారు. ఇక ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చాడు.

 ఫుల్ లెన్త్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుందని.. సరికొత్త సబ్జెక్టును రజనీ కోసం సిద్ధం చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే లోకేష్ కనకరాజ్ మూవీ అనడంతో భారీ రేంజ్ లోనే హైప్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ చెప్పిన మాటలతో ఈ మూవీపై పెరిగిపోయిన అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. దీంతో రజినీకాంత్ మూవీ ఎలా ఉండబోతుందో అని ఊహగానాల్లోకి వెళ్ళిపోతున్నారు అభిమానులు. అంతేకాదు ఈ మూవీతో రజిని మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: