వన్డే ఫార్మాట్లోకి రాబోతున్న.. సిక్సర్ల కింగ్ రింకు సింగ్?

praveen
గత కొద్దికాలం నుంచి భారత క్రికెట్ లో బాగా మార్మోగిపోతున్న పేరు రింకు సింగ్. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ప్లేయర్.. ఇక ఇప్పుడు భారత జట్టు తరుపున కూడా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి భారత జట్టును వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని ఇక తన బ్యాటింగ్తో నిరూపిస్తున్నాడు.


 మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి వస్తూ ఏకంగా విధ్వంసం సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ సైతం ఆయాసం వచ్చేలా పరుగులు చేస్తూ ఉన్నాడు ఈ యువ ఆటగాడు. అయితే ఇన్నాళ్ల వరకు టీమిండియా తరఫున టీ20 లలో తన మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్న రింకు సింగ్.. ఇక వన్డే ఫార్మాట్లోకి కూడా అరంగేట్రం చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు అతనికి ఇలాంటి లక్కీ ఛాన్స్ వచ్చింది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఈ టూర్ లో మూడు ఫార్మట్లలో సిరీస్ లు ఆడబోతుంది. ఇప్పటికే t20 సిరీస్ ముగిసింది.


 నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో సిక్సర్ల కింగ్ రింకు సింగ్ ఇక వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది అనేది తెలుస్తుంది. అతనితోపాటు తమిళనాడు బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఓపెనర్ గిల్ కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్ గా సుదర్శన్ ను తీసుకొనున్నారట. ఇక సంజు శాంసన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఆల్ రౌండర్ కోటాలో అక్షర పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: