ఐపీఎల్ 2024 కోసం.. ఆర్సిబి ట్రైనింగ్ షురూ?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రేక్షకులను ఎంతలా అలరిస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అనే పదానికి ఈ టోర్నీ కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఐపీఎల్ ప్రారంభమైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండుగ మొదలవుతూ ఉంటుంది. ఇక ఈ టోర్నీ జలిగినన్ని రోజులు కూడా ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటినుంచి సన్నాహాలు మొదలయ్యాయి.



 ఇక అన్ని టీమ్స్ కూడా ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగినందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్ వేలం డిసెంబర్ 19వ తేదీన దుబాయ్ వేదికగా జరగబోతుంది. అయితే అంతకు ముందుగానే ఐపీఎల్ ట్రేడింగ్ లో భాగంగా తమ జట్టులోకి కావలసిన ఆటగాళ్లను ఇతర టీమ్స్ నుంచి ట్రేడింగ్ చేసుకున్నాయి అని చెప్పాలి. ఇక ఈసారి వేలంలో ఎంతో మంది స్టార్ పేర్లు ఉండడంతో రికార్డ్స్ స్థాయి ధర పలికే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ అన్ లక్కీ టీం ఏది అంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెబుతూ ఉంటారు.

 ఎందుకంటే ఈ టీం ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి నిరాశపరచడం లాంటివి చేస్తూ ఉంది. దీంతో ఇక బెంగళూరు టీం కి టైటిల్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్న ఆ టీం కి మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం.


 ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ కోసం బెంగళూరు జట్టు ఇప్పటికే సన్నదమవుతుంది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ట్రైనింగ్ క్యాంపును కూడా ఏర్పాటు చేసింది అన్నది తెలుస్తుంది. ఈ శిబిరంలో పలువురు ఆర్సిబి ఆటగాళ్లు పాల్గొంటున్నారట. హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ఆటగాళ్లకు విలువైన సూచనలు సలహాలు ఇస్తున్నారట. అయితే ఇక టైటిల్ రేస్ లో వెనుకబడుతున్న నేపథ్యంలో.. 2024 ఐపిఎల్ సీజన్ కి ముందే కోచింగ్ సిబ్బంది లో కూడా ఎన్నో మార్పులు చేసింది జట్టు యాజమాన్యం. మరి ఈసారైనా టైటిల్ గెలవాలని కల ఆ టీం కి తీరుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: