భార్య సూసైడ్.. పక్కనే ఉన్న భర్త ఏం చేశాడో తెలుసా?
సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం మానేసి భయంతో వణికిపోతూ చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది. సాధారణంగా ఎవరైనా ముక్కు మొఖం తెలియని వాళ్ళు కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటేనే అయ్యో పాపం అని వారిని నిలువరించడం లాంటివి చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ కట్టుకున్న భార్య కళ్ళ ముందు సూసైడ్ చేసుకున్న భర్త ఆపలేదు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.
ఈ అమానవీయ ఘటన ఎక్కడో వెలుగులోకి రాలేదు. హైదరాబాద్ నగరంలోనే జరిగింది. భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే నవ్వుతూ వీడియో తీసాడు భర్త. అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రసూల్ అనే 39 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. అయితే ఇటీవల మద్యం మత్తులో రెండవ భార్య బేగంతో గొడవపడ్డాడు. ఇక మనస్థాపంతో ఆమె ఉరేసుకుంటూ ఉండగా.. భర్త అక్కడే ఉండి ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక నువ్ చస్తే మొదటి భార్యతో ఉంటాను అంటూ ఆమెతో చెప్పాడు. చివరికి సూసైడ్ చేసుకుందని బంధువులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆరా తీయగా సూసైడ్ చేసుకున్న సమయంలో వీడియో తీసినట్టు తేలడంతో అతని అరెస్టు చేశారు.