సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కి ముందు.. టీమిండియాకు బిగ్ షాక్?
ఇక సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ లో బరిలోకి దిగిన టీమిండియా అదరగొట్టింది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో చివరికి 1-1 తో టి20 సిరీస్ సమమయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వన్డే సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ లో కూడా ఆడబోతుంది భారత జట్టు. అయితే అటు వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ సారథ్యం వహించబోతున్నాడు. ఇక టెస్ట్ సిరీస్ కి రెగ్యులర్ కెప్టెన్ లోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టనుండగా.. విరాట్ కోహ్లీ సహా మరి కొంతమంది సీనియర్ క్రికెటర్లు కూడా జట్టులోకి రాబోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కి ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది.
వరల్డ్ కప్ లో అదరగొట్టిన మహమ్మద్ షమీ ఇక సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ లో కూడా భారత్ విజయంలో కీలకంగా మారతాడు అనుకుంటే అతను ఇక టెస్టు సిరీస్ లో ఆడటం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే షమీ చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి దూరం కాబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈనెల 26వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా తో టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు