వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ కీ.. క్రికెట్ ఆస్ట్రేలియా బాధ్యతలు?
అందుకే ట్రావిస్ హెడ్ అంటే ఎందుకో భారత క్రికెట్ ప్రేక్షకులకు కాస్త భయం కలుగుతూ ఉంటుంది. ఇక ఆస్ట్రేలియా తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను జట్టులో ఉన్నాడు అంటే అతను తొందరగా అవుట్ అయితే బాగుండు అని దేవుని కోరుకునే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వరకు రెండు ఐసీసీ ట్రోఫీలను భారత జట్టుకు దూరం చేసింది ఇతడే. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ పై సెంచరీ చేయడంతో వరల్డ్ కప్ హీరో అంటూ ఇతన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు.
అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా నిలకడైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్ లోను అదరగొడుతున్నాడు. అయితే ఇటీవల వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ కు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక బాధ్యతలను అప్పగించింది. ఏకంగా ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ గా నియమించింది. స్టీవ్ స్మిత్ తో కలిసి అతను కో వైస్ కెప్టెన్ గా ఉంటాడని.. క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఆసీస్ పాకిస్తాన్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ కు అతను వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. కాగా ఈ విషయం తెలిసి అతని అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు.