ఐపీఎల్ వేలంలో.. అతనికే భారీ ధర : ఆకాష్ చోప్రా

praveen
ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి మొదలైంది. 2023 ఐపీఎల్ సీజన్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగి ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కోసం అన్ని సన్నహాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా ఇప్పటికే తమతో అంటిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలతో పాటు ఇక వేలంలోకి వదిలేసే ప్లేయర్స్ డీటెయిల్స్ కూడా పూర్తిగా సమర్పించాయి. ఈ క్రమంలోనే చాలా జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి.


 అయితే ఇక డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం జరగబోతుంది. దుబాయ్ వేదికగా ఈ వేలం జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఈ మినీ వేలంలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా పాల్గొంటూ ఉండడంతో ఈసారి రికార్డ్ స్థాయి ధర పలికే అవకాశం ఉంది అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భారత మాజీలు సైతం ఇదే విషయంపై స్పందిస్తూ ఈ వేలంలో అత్యధిక ధర పలకబోయే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా తమ అంచనాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.


ఇలాంటి రివ్యూలు తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఫేసర్ మిచెల్ స్టార్క్ అత్యధిక ధర పలుకుతాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆకాష్ చోప్రా. స్టార్క్ ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఇక పవర్ ప్లే లో వికెట్లు తీయడంతో పాటు యార్కర్లు వేసే సత్తా అతనికి ఉంది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున కూడా అతను బాగా ఆడాడు. ప్రస్తుతం ఆయన అన్ని ఫ్రాంచైజీలను   ఆకర్షిస్తున్నాడు. దీంతో భారీ ధర పలికే అవకాశం ఉంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: