టి20 వరల్డ్ కప్ కెప్టెన్ గా రోహిత్.. జై షా కీలక వ్యాఖ్యలు?
అయితే ఇక ఇప్పుడు వచ్చే ఏడాది జరగబోయే 2024 t20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా టీమ్ ఇండియా ముందుకు సాగుతుంది. ఇలాంటి సమయంలో గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వన్డేలపై ఫోకస్ చేయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు టి20 ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతలు చేపడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు
వరల్డ్ కప్ కు రోహిత్ శర్మని కెప్టెన్గా వ్యవహరిస్తాడని.. గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవల ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా ఆయన మాట్లాడారు. టి20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా ఎవరు ఉంటారు అనే విషయంపై ఇప్పటివరకు ఏం నిర్ణయం తీసుకోలేదు. అయినా ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. వరల్డ్ కప్ టోర్నీ జూన్లో కదా. అప్పటివరకు ఐపీఎల్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ లు కూడా జరుగుతాయి అంటూ చెప్పుకొచ్చాడు జై షా. దీన్నిబట్టి చూస్తే టి20 కెప్టెన్సీ విషయంలో చివర్లో బీసీసీఐ ట్విస్ట్ ఇవ్వబోతుంది అన్నది తెలుస్తోంది.