వారెవ్వా.. సిరీస్ గెలుచుకున్న టీమిండియా?
ఇక ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే కేవలం భారత పురుషుల జట్టు మాత్రమే కాదు మహిళలు టీం కూడా ఇదే దూకుడుతో ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది భారత మహిళల జట్టు. ఈ క్రమం లోనే ఈ సిరీస్ లో దూకుడుగా ముందుకు సాగుతూ సిరీస్ ను చేజిక్కించుకుంది అని చెప్పాలి. ఇటీవల జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు విజయం సాధించడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్లో తోలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే కెప్టెన్ హీతర్ నైట్ 52 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లు శ్రేయంక పాటిల్, సైకా చెరో మూడు వికెట్లు తీశారు. అయితే అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు 19 ఓవర్ల లోనే టార్గెట్ ను ఛేదించింది. స్మృతి మందాన 48 పరుగులతో టాప్స్ స్కోరర్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే అంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్ లలో ఒక మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా.. 2-1 తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి.