పాక్ జట్టుకి ఘోర అవమానం.. సారీ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా?

praveen
ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అన్ని టీమ్స్ కూడా ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ సొంత గడ్డపై మ్యాచ్లు ఆడుతూ ఉంటే మరికొన్ని టీమ్స్ విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనల్లో ఉండగా.. ఇక భారత దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టూ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక వార్మమ్ మ్యాచ్ లు ఆడుతుంది   పాకిస్తాన్ టీం అయితే ఇలా వార్మప్ మ్యాచ్ ఆడుతున్న పాకిస్తాన్ టీం కి ఘోరమైన అవమానం జరిగింది అని చెప్పాలి.


 సాధారణంగా పాకిస్తాన్ టీమ్ ను స్కోర్ బోర్డులో పాక్ అని చూపించడం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవలే వార్మప్ మ్యాచ్ సమయంలో ఏకంగా పాకిస్తాన్ జట్టును పాకీ అని రాశారు. అయితే ఈ విషయాన్ని ఒక ఆస్ట్రేలియా జర్నలిస్టు చెప్పే వరకు ఎవరు గమనించలేదు అని చెప్పాలి  అయితే పాకీ అని అనడం జాతి వివక్ష కిందికే వస్తుంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఆ స్కోర్ కార్డులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని గమనించిన క్రికెట్ ఆస్ట్రేలియా వెంటనే తప్పును సరిదిద్దుకొని క్షమాపణలు చెప్పడం గమనార్హం.


 స్కోర్ కార్డులో పాకీ అని ఉండటానికి మొదట గమనించిన జర్నలిస్టు పేరు డాని సయ్యద్ అయితే పాక్ ఛానల్ చేసిన పొరపాటును అతని బయట పెట్టడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇదే విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది గ్రాఫిక్ డేటా ప్రొవైడర్ అందించిన ఆటోమేటిక్ ఫీడ్. గతంలో పాకిస్తాన్ మ్యాచ్కు ఉపయోగించలేదు. ఇది నిజంగా చింతించాల్సిన విషయం. ఇది తెలియగానే ఆ పొరపాటున మేము సరిదిద్దాము అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ ఇచ్చింది. అయితే పాకిస్తాన్ లేదా దక్షిణాసియాలో జన్మించిన వ్యక్తిని జాతి వివక్షకు గురిచేసేందుకు పాకీ అని పిలుస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: