త్వరలోనే కేజిఎఫ్-3.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాదట?
ఈ మూవీ పేరు చెబితే చాలు సినీ ప్రేక్షకులందరికీ కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది ఈ మూవీ. ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్ చూసి ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా అన్ని భాషల బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కేజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ గా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అని చెప్పాలి. అయితే కే జి ఎఫ్ 2 సినిమా విడుదలైన నాటి నుంచి కూడా ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అందరూ నమ్మడం మొదలుపెట్టారు.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అటు చిత్ర బృందం నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఈ సినిమా నిర్మాత కేజిఎఫ్ 3 ఉంటుంది అంచనాలకు మించి ఉంటుంది కామెంట్ చేయగా.. మళ్లీ అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ 3 సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కే జి ఎఫ్ పార్ట్ 3 స్క్రిప్ట్ కి లాక్ చేసాం. అయితే దానికి నేను డైరెక్షన్ చేస్తానో లేదో తెలియదు. యష్ తప్పకుండా అందులో ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రశాంత్ నీల్ కాకుండా మరో డైరెక్టర్ అంటే కేజిఎఫ్ ని ఎలా తీస్తాడో అనే చర్చ మళ్ళీ మొదలైంది. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ అటు ప్రభాస్ తో సలార్ సినిమాతో పాటు తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నాడు.