పెంపుడు కుక్క కొరికింది.. చివరికి రెండు కాళ్లు పోయాయి?

praveen
ఒకప్పుడు కుక్కలు కేవలం పెంపుడు జంతువులు గానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పెంపుడు జంతువులకు ప్రమోషన్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు కుక్కలకు పెంపుడు జంతువులు కాదు ఏకంగా ప్రతి ఇంట్లో మనిషి లాగానే హోదాని సంపాదించాయి అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే అటు కుక్కల మీద మనుషులు చూపిస్తున్న ప్రేమే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక కొంతమంది ట్రెండ్ ఫాలో అవ్వడానికి ఏదో ఒక పెంపుడు కుక్కని తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవడం చేస్తుంటే.. ఇంకొంతమంది కుక్కల విశ్వాసం నచ్చి ఇక వాటిపై ప్రేమతో  ఇంట్లో మనుషుల్లా పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు.


 అయితే ఒకప్పుడు కేవలం బాగా డబ్బున్న వారు మాత్రమే మంచి బ్రీడ్ కుక్కలను తెచ్చుకుని పెంచుకునేవారు. కానీ ఇటీవల కాలంలో సామాన్యులు సైతం ఇలా మంచి బ్రీడ్ కుక్కలను తెచ్చుకునేందుకు వెనకాడకు వేయడం లేదు. ఇలా కుక్కల మీద ఇంత ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు అని అడిగితే.. ప్రస్తుతం కుళ్ళు కుతంత్రాలతో నిండిన ఆలోచనలతో ఉన్న మనుషుల కంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసం చూపించె కుక్కలే బెటర్ అంటూ కొంతమంది సమాధానాలు కూడా చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక మహిళ కూడా ఇలాగే ఎంతో ప్రేమగా కుక్కను పెంచుకుంది. కానీ ఆ కుక్క కారణంగానే చివరికి ఆమె రెండు కాళ్ళను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.


 ప్రేమగా పెంచుకున్న కుక్క ఆమె మీద దాడి చేయడంతో చివరికి ఆమె రెండు కాళ్లు తీసేసారు డాక్టర్లు. ఈ షాకింగ్ ఘటన యూఎస్ లో వెలుగులోకి వచ్చింది. బ్రిటని స్కోల్యాండ్ అనే 63 ఏళ్ల మహిళ కుమారుడు పిట్ బుల్ జాతికి చెందిన 3 కుక్కలను పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ పెంపుడు కుక్కలు ఆమెపై దాడి చేసి విపరీతంగా కరిచాయి. అయితే పక్కింటి వాళ్ళు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడిలో ఆమె రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు  కావడంతో చివరికి ఆపరేషన్ చేసి మోకాళ్ళ వరకు ఆమె కాళ్ళను తొలగించారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: