బాల్ ట్యాంపరింగ్ చేసిన వ్యక్తికి.. ఘనమైన వీడ్కోలా?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా 40 ఏళ్లకు చేరు అవుతున్నాడు అంటే చాలు ఇక రిటైర్మెంట్ ఆలోచన చేయడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో చూసుకుంటే 40 ఏళ్ళే అటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగడానికి ప్రామాణికమైన ఏజ్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నలభై ఏళ్లకు మంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన ఆటగాళ్లు దాదాపు ఎక్కడ కనిపించరు. ప్రస్తుతం ఇలా రిటైర్మెంట్ ఆలోచనలతోనే తన కెరియర్ని ముందుకు నడిపిస్తున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.

 గత కొంతకాలం నుంచి అతని రిటైర్మెంట్ గురించి ఎన్నో వార్తలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పట్లో తాను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేవు అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇస్తూనే వస్తున్నాడు. అయితే 37 ఏళ్ల ఈ స్టార్ బ్యాట్స్మెన్ త్వరలో సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈనెల 14 నుంచి పాకిస్తాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తర్వాత ఇక ఈ ఫార్మాట్ కి వీడ్కోలు పలకపోతున్నాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే వార్నర్ లాంటి స్టార్ బ్యాటర్ కు సరైన వీడ్కోలు దక్కితే బాగుంటుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తుంది.


 ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు వార్నర్ గురించి చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో ప్రజలకు మారిపోయాయి అని చెప్పాలి. బాల్ టాంపరింగ్ చేసి జైలుకు వెళ్లిన డేవిడ్ వార్నర్ కు హీరోలా సెండ్ ఆఫ్ ఇవ్వడం ఏంటి అంటూ ఆ జట్టు మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును ప్రశ్నించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా ఓపెనర్ కవాజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ తనకు ఎప్పటికీ హీరోనే అంటూ చెప్పుకొచ్చాడు. వార్నర్ చేసిన తప్పుకి  జైలు శిక్ష అనుభవించాడు అంటూ గుర్తు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: