విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. వరల్డ్ కప్ లో కష్టమేనట?
కానీ ఇద్దరు ప్లేయర్లు టి20 వరల్డ్ కప్ ఆడితేనే భారత జట్టు విజయం సాధించగలరని ఎంతోమంది మాజీ ప్లేయర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా కాకుండా రోహిత్ శర్మని సారధిగా కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక రోహిత్ టి20 వరల్డ్ కప్ కి సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది రోహిత్ కెప్టెన్సీ చేపట్టాడు అంటే మరో సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ కూడా జట్టులోకి వస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కోహ్లీ ఫ్యాన్స్ ని షాక్ లో ముంచేసే ఒక వార్త వైరల్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో ఆడడం కష్టమే అంటూ ఒక టాక్ వైరల్ గా మారిపోయింది.
2024 లో జరగబోతున్న టి20 వరల్డ్ కప్ కు కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉండబోతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే జట్టులో కోహ్లీకి చోటు కష్టము అంటూ తెలపడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలెక్టర్లు ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది శుభమన్ గిల్, యశస్వి జైష్వాల్ లాంటి యంగ్ ప్లేయర్స్ రావడం మంచి ఫామ్ లో కొనసాగడంతో ఇక కోహ్లీకి చోటు దక్కడం లేదు అని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ అధికారులు విరాట్ కోహ్లీతో మాట్లాడతారు అంటూ జాతీయ మీడియా పేర్కొంది. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.