ఆస్ట్రేలియా గెలిచినా.. ఆ జట్టు బౌలర్ చెత్త రికార్డు.

praveen
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు వరల్డ్ కప్ లో మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేసిన క్రికెట్ ప్రేక్షకులు ఇక ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టి20 సిరీస్ చేస్తూ సూపర్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అని చెప్పాలి. అయితే ప్రతి మ్యాచ్లో కూడా ఇరు జట్లు భారీ స్కోర్ నమోదు చేస్తూ ఉండడంతో.. ఇక ఈ మ్యాచ్లను చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పాలి.

 అయితే వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్లందరికీ కూడా విశ్రాంతి ప్రకటించడంతో.. సూర్యకుమార్ యాదవ్ చేతికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ యంగ్ ప్లేయర్స్ అందరికి కూడా టీంలో చోటు కల్పించింది. దీంతో వచ్చిన అవకాశాన్ని భారత యువ ఆటగాళ్లు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా బ్యాటింగ్లో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్లో కూడా భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు.

 కేవలం 3 వికెట్ల మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేశారు. దీంతో ఇంత భారీ టార్గెట్ ను ఆస్ట్రేలియా ఛేదించలేదని టీమిండియా విజయం ఖాయం అనుకున్నప్పటికీ మాక్స్వెల్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియాకు విజయం వరించింది. అయితే ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ అటు ఆ జట్టు బౌలర్ ఆరోన్ హార్ది  మాత్రం ఒక చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు  ఈ మ్యాచ్ లో నాలుగో ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 64 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టి20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా నిలిచాడు. ఆరోన్ హార్ది. అంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టై కూడా ఇలా 64 పరుగులు ఇచ్చి చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ais

సంబంధిత వార్తలు: