షాకింగ్ : రిటైర్మెంట్ ప్రకటించిన.. పాక్ స్టార్ ప్లేయర్?
కొంతమంది ఫామ్ కోల్పోయి జట్టుకు దూరం అవడంతో.. అవకాశాలు లేక రిటైర్మెంట్ ప్రకటిస్తుంటే.. ఇంకొంతమంది మూడు ఫార్మట్లు ఆడితే ఒత్తిడి ఎక్కువ అవుతుందని.. ఏదో రిటైర్మెంట్ ఆలోచన చేసి ఏదో ఒక ఫార్మాట్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇలా ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నఫలంగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉన్న తీరు చూసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ సైతం ఇలా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు ఇమాద్ వసీం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
అతని ప్రవర్తన ఫామ్ సరిగ్గా లేకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు అంతేకాదు ఇక టీం లోని ప్లేయర్లతో అతనికి వివాదాలు కూడా ఉన్నాయ్. దీంతో అతనికి టీం లో చోటు దక్కుతుంది అని ఎదురుచూసిన అది జరగలేదు. ఇక వన్డే వరల్డ్ కప్ లో అయినా అతన్ని జట్టులోకి తీసుకుంటారని భావించాడు. కానీ అలా కూడా జరగకపోవడంతో నిరాశ చెంది చివరికి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా పాకిస్తాన్ తరఫున 2015లో అరంగేట్రం చేశాడు 34 ఏళ్ల ఇమాద్ వసీం. పాక్ జట్టు తరపున 55 వన్డే మ్యాచ్లలో 986 పరుగులు చేసి 44 వికెట్లు తీశాడు. 66 t20 లలో 486 పరుగులు చేసి 65 వికెట్లు పడగొట్టాడు. వసీం చివరిగా ఈ ఏడాది న్యూజిలాండ్తో జరిగిన టి20 మ్యాచ్ లో పాకిస్తాన్ తరఫున ఆడాడు.