నిజమే.. సూర్య టీ20లకే సరిపోతాడు.. వీడియో గేమ్ చూపించడుగా?
ఎప్పుడో కాలం కలిసి వచ్చి అడపాదడపా హాఫ్ సెంచరీలు చేశాడు తప్ప.. జట్టుకు అవసరమైనప్పుడు ఒక్కసారి కూడా బ్యాట్ జులిపించలేకపోయాడు. దీంతో అతను టి20 ఫార్మాట్ కే సరైన ఆటగాడు అన్న విషయం అందరికీ అర్థమైంది. అయితే మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో కూడా సూర్యకుమార్ కొన్ని మ్యాచ్లు ఆడాడు. కేవలం ఒకే ఒక మ్యాచ్ లో మాత్రమే హాఫ్ సెంచరీ చేసి మిగతా మ్యాచ్లో మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో అతను ఫామ్ కోల్పోయాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో మరోసారి ఇరగదీసాడు.
తనదైన రీతిలో మైదానం నలువైపులా షాట్లు ఆడాడు. 42 బంతుల్లోనే 9 ఫోర్లు నాలుగు సిక్సర్లతో 80 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. అయితే సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చూసి మరోసారి వీడియో గేమ్ చూపించేశాడు అంటూ స్కై పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది ఇక సూర్యకుమార్ మరోసారి t20 లకే సరిపోతాడు అన్న విషయం ఇక ఈ మ్యాచ్తో నిరూపితం అయింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. మరి దీనిపై మీరేమంటారు.