బిగ్ బాస్ బిగ్ ప్లాన్.. ఆ ముగ్గురు టాప్ 3 లో?
అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా మైండ్ గేమ్ ఆడుతూ ప్రతి వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్న శివాజీని.. ఇక బిగ్ బాస్ ఏడవ సీజన్ విన్నర్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక ఆ తర్వాత రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టాప్ 2 లో ఉంటాడని అందరూ అనుకుంటూ ఉండగా.. బిగ్బాస్ మిగతా టాప్5 కంటెస్టెంట్ల కోసం ఇక గట్టిగానే ప్లాన్ చేశాడు అని తెలుస్తుంది.
మొదటినుంచి బిగ్ బాస్ నిర్వాహకులు సీరియల్ బ్యాచ్ గా పేరున ప్రియాంక, శోభ, అమర్దీప్ లను కాస్త సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో అర్జున్ అంబటి కూడా చేరిపోయాడు. ఇక ఈ సీరియల్ బ్యాచ్ పెద్దగా తప్పులు చేసిన కూడా అటు నాగార్జున ఏమి అనడం లేదు. కొన్ని కొన్ని సార్లు తప్పకుండా ఎలిమినేట్ అవుతారు అనుకున్న సమయంలో కూడా ఈ సీరియల్ బ్యాచ్ ని ఎలిమినేషన్ నుంచి బిగ్ బాస్ బయట పడేసాడు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ చూసుకుంటే.. ఈ సీరియల్ బ్యాచ్ లో ముగ్గురిని టాప్ ఫైవ్ లో ఉండేలా చూసుకుంటూ ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో అటువైపు అడుగులు వేస్తున్నారట బిగ్బాస్ నిర్వాకులు. ఇక ఏం జరుగుతుందో చూడండి మరి.