రాజకీయాల్లోకి స్టార్ క్రికెటర్.. కెరియర్ పీక్స్ లో ఉండగానే?
ఒకప్పుడు క్రికెట్లో స్టార్లుగా కొనసాగి ఆ తర్వాత కెరియర్ ముగింపు తర్వాత ఇక ఏదో ఒక జట్టుకు కోచ్ గా లేదా వ్యాఖ్యాతగా వ్యవహరించడం చేసేవారు క్రికెటర్లు. కానీ ఇటీవల కాలంలో మాత్రం చాలా మంది క్రికెటర్లు కెరియర్ ముగిసిన తర్వాత ఇక పాలిటిక్స్ లోకి అడుగుపెడుతూ అక్కడ సత్తా చాటమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఇలా ఎవరైనా క్రికెటర్ ఇలా రాజకీయాలవైపు అడుగులు వేశాడు అంటే అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా వరల్డ్ క్రికెట్లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న ఒక ప్లేయర్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడు.. అంటే ఒక వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది అని చెప్పాలి.
అయితే అతను ఇండియన్ క్రికెటర్ కాదులెండి.. బంగ్లాదేశ్ కెప్టెన్ గా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న షాకీబ్ ఉల్ హాసన్. త్వరలోనే ఈ ప్లేయర్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడట. అధికార బంగ్లాదేశ్ అవామి లీగ్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీ నుంచి షాకీబ్ ఇప్పటికే నామినేషన్ పాత్రలు కూడా తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశ యువతలో మంచి పాపులారిటీ ఉన్న షాకీబ్ ఇక వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు పార్టీ ప్రతినిధి నసీం చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా షాకీబ్ అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించారు అంటూ చెప్పుకోచ్చారు.