ఫైనల్ మ్యాచ్ కోసం.. నన్ను ఎవరు పిలవలేదు : కపిల్ దేవ్
ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అతిరథ మహారథులు అందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ తుది పోరు జరగడానికి ముందు నుంచి కొన్ని వార్తలు వైరల్ గా మారిపోయాయ్. ఏకంగా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లను కూడా అటు బీసీసీఐ ఫైనల్ మ్యాచ్ కోసం పిలవడానికి సిద్ధమైంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో టైటిల్ గెలిచిన కెప్టెన్లుగా ఉన్న వారికి ఆహ్వానం అందిందని వారికి ప్రత్యేక బ్లేజర్లు కూడా కేటాయించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయంపై 1983లో భారత జట్టుకు మొదటి సారి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా కొనసాగుతున్న కపిల్ దేవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు తనకు ఆహ్వానం అందలేదు అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్. ఇక తనకు ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతో నేను ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి వెళ్ళలేదు. అయితే 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టు సభ్యులతో నేను స్టేడియానికి వెళ్లాలని కోరుకున్నాను. అయితే ఇది చాలా పెద్ద ఈవెంట్ కావడంతో.. బీసీసీఐ పెద్దలు అందరూ కూడా అన్ని పనులు చూసుకోవడంలో బిజీగా ఉంటారు. దీంతో కొన్ని బాధ్యతలు నిర్వహించడం మర్చిపోతారు అంటూ ఇక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా ఉన్న కపిల్ దేవ్ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.