వరల్డ్ కప్ హిస్టరీలో.. ట్రావిస్ హెడ్ రికార్డ్?

praveen
ఎన్నో ఆశలతో ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ 2023 సీజన్ మళ్లీ భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా నిరాశే మిగిల్చింది అన్న విషయం తెలిసిందే. సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో.  ఇక ఈసారి టైటిల్ టీమిండియాదే అని భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్లుగానే భారత జట్టు ప్రస్థానం కూడా కొనసాగింది అన్న విషయం తెలిసిందే. వరుసగా అన్ని మ్యాచ్ లలో విజయం సాధిస్తూ అదరగొట్టింది. ఇక ఎప్పుడు విజయం సాధించలేని న్యూజిలాండ్ పై సైతం సెమీఫైనల్ లో విజయం సాధించింది.

 ఇక ఇంత దూకుడుతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాను.. అడ్డుకునే టీం మరొకటి లేదు అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు ఫైనల్ లో ఆస్ట్రేలియాని ఓడించి తప్పకుండా టైటిల్ గెలుస్తుంది అని అందరూ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో టీమ్ ఇండియాకు ఘోర పరాభవం ఎదురయింది అని చెప్పాలి. ఇక భారత జట్టు ఫైనల్ లో ఆస్ట్రేలియా దాటికి సరైన ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో ఇక ఓటమితో అందరిని నిరాశపరిచింది అని చెప్పాలి. ఒకరకంగా ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమిని శాసించింది మాత్రం ట్రావిస్ హెడ్ అని చెప్పాలి.

 ఎందుకంటే కనీసం పరుగులు చేయడానికి సైతం భారత బ్యాట్స్మెన్లు ఎంతో కష్టపడి పోయిన పిచ్ పై అతను సెంచరీ సాధించి జట్టును విజయతీరాల వైపుకు నడిపించాడు. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 137 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. వరల్డ్ కప్ చరిత్రలో సెమీఫైనల్ తో పాటు ఫైనల్ మ్యాచ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన నాలుగవ ప్లేయర్గా నిలిచాడు ఈ ఆటగాడు. ఈ లిస్టులో అతని కంటే ముందు మోహిందర్ అమర్నాథ్ (1983), అరవింద డిసిల్వా (1996) షేన్ వార్న్ (1999) ఉన్నారు. అయితే సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ లో కూడా బ్యాటింగ్లో 62 పరుగులు బౌలింగ్ లో రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: