పెళ్లిళ్లతో లింక్.. వరల్డ్ కప్ టైటిల్ ఆస్ట్రేలియాదేనట?
అయితే నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతిరథ మహారధులు అందరూ కూడా.. ఈ మెగాటోర్ని చివరి పోరును వీక్షించేందుకు నేరుగా స్టేడియం కు రాబోతున్నారు. సినీ తారల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖులు మ్యాచ్ చూడడానికి రాబోతున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇండియా ప్రధాన మంత్రులు కూడా మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు అని చెప్పాలి. అయితే నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని వింతైన సెంటిమెంట్లు కూడా తేరమీదికి వస్తున్నాయ్.
అయితే ఇప్పటికే కొన్ని సెంటిమెంట్లు తెరమీదకి వచ్చి.. ఈ వరల్డ్ కప్ లో టైటిల్ టీమిండియాదే అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లిళ్లతో లింకు పెడుతూ వరల్డ్ కప్ టైటిల్ ఆస్ట్రేలియాదే అంటూ మరో టాక్ తెరమిదికి వచ్చింది అని చెప్పాలి. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే 2002లో ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ పెళ్లి చేసుకోక 2003లో వరల్డ్ కప్ టైటిల్ గెలిచాడు. 2010లో ధోని పెళ్లి పీటలు ఎక్కితే 2011లో టీమిండియా ట్రోఫీ నెగ్గింది. 2018లో ఇయన్ మోర్గాన్ పెళ్లి చేసుకుంటే 2019లో కప్పు గెలిచాడు. అయితే 2022లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో 2023లో అతను కప్పు గెలుస్తాడంటూ ఒక సెంటిమెంట్ తెరమీదకి వచ్చింది.