ప్చ్.. ఫైనల్ మ్యాచ్లో ఐరన్ లెగ్ అంపైర్.. ఏం జరుగుతుందో?

praveen
నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 1,32,000 మంది ప్రేక్షకుల మధ్య ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందే అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలను కూడా నిర్వహించబోతుంది బీసీసీఐ. ఇక అతిరథ మహారథులు ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేడుకకు హాజరు కాబోతున్నారు అని చెప్పాలి. అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈసారి ప్రపంచకప్ టోర్నీలో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అని తెలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నారు.


 ఆదివారం రోజున జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కావడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఆరోజు ఎలాంటి పని పెట్టుకోకుండా ఇక టీవీలకు అతుక్కుపోవాలని ఇప్పుటికే డిసైడ్ అయ్యారు. కొన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్ అక్కడక్కడ పెద్దపెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఇక ప్రేక్షకులకు వరల్డ్ కప్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా.. ఎట్టి పరిస్థితుల్లో విజేతగా నిలుస్తుంది అని క్రికెట్ ప్రపంచం మొత్తం భావిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఒక విషయం మాత్రం భారత అభిమానులు అందరిని కూడా కలవరపెడుతుంది అని చెప్పాలి.


 భారత జట్టుకు అస్సలు అచ్చిరాని అంపైర్గా కొనసాగుతున్న ఒక ఐరన్ లెగ్ అంపైర్ వరల్డ్ కప్ లో ఉండబోతున్నాడట. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా శని దేవుడిలా భావించే అంపైర్ రిచార్డ్ కెటిల్ భరో వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్గా వ్యవహరించబోతున్నాడట. అతను అంపైరింగ్ చేసిన ఏ ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్ లో భారత జట్టు విషయం సాధించలేదు. దీంతో ఈసారి ఏమవుతుందో అనే ఆందోళనలో ఉండిపోయారు భారత క్రికెట్ ఫ్యాన్స్. కాగా రిచార్డ్ కెటిల్ బరో ఎంపైర్ గా 2014 టి20 వరల్డ్ కప్ ఫైనల్, 2017 వరల్డ్ కప్ సెమి ఫైనల్, 2016 t20 వరల్డ్ కప్ సెమి ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ లలో అతను అంపైరింగ్ చేయగా టీమిండియా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: