
అమితాబ్ జీ.. ప్లీజ్ మీరు ఫైనల్ మ్యాచ్ కి రావొద్దు.. చూడొద్దు?
అయితే క్రికెట్ విషయంలో ఎంతోమంది అభిమానులు సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఒకచోట కూర్చున్న సమయంలో అభిమాన ఆటగాడు సిక్సర్ కొట్టాడు అంటే చాలు ఇక అదే చోట కదలకుండా కూర్చోవాలని.. అలా అయితేనే టీమిండియా గెలుస్తుందని సినిమాల్లో చూపించినట్లుగానే నిజజీవితంలోనూ ఎంతో మంది ప్రేక్షకులు సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అచ్చం ఇలాగే కొంతమంది సెలబ్రిటీల విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్స్ కొన్ని ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ మ్యాచ్ చూడడానికి వచ్చారంటే టీమిండియా గెలవడం కష్టమని బాగా నమ్ముతూ ఉంటారు.
ఇలా భారత జట్టుకు బ్యాడ్ సెంటిమెంట్ అనుకునే సెలబ్రిటీలలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు అమితాబచ్చన్ రాబోతున్నారు. దీంతో ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ బి ప్లీజ్ ఫైనల్ మ్యాచ్ కి రావద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వస్తే ఓడిపోతామేమో అని ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సెమిస్లో కివీస్ పై గెలిచాక నేను చూడనప్పుడే మనం మ్యాచ్ గెలుస్తాం అంటూ బిగ్ బి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అది కాస్త అమితాబ్ ను మ్యాచ్కి రావద్దు అనే స్థాయికి వెళ్ళింది. ఇక ఈ విషయంపై స్పందించిన అమితాబచ్చన్.. మ్యాచ్ కి వెళ్లాలా? వద్ద? ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్న అంటూ అంటూ ఒక పోస్ట్ పెట్టగా అది వైరల్ గా మారింది.