వరల్డ్ కప్ - 2023.. ఆ ఇద్దరికి ఎంతో స్పెషల్?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఇప్పటికే రెండు సెమి ఫైనల్ మ్యాచ్లు ముగిసాయి. ఇక నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇక ఈసారి వరల్డ్ కప్ లో టైటిల్ గెలిచి..  విశ్వ విజేతగా అవతరించే టీం ఏది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా లాంటి రెండు బలమైన ప్రత్యర్థులు హోరాహోరీగా తలబడబోతున్నాయి అని చెప్పాలి.


 అయితే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఎంతో మంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. కెరియర్ లోనే బెస్ట్ ఫామ్ లో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇక వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఓడిపోయి ఇంటి బాట పట్టినప్పటికీ ఇక ఆయా ప్లేయర్లు చేసిన ప్రదర్శన మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో సందేహం లేదు.  ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఇలా అత్యుత్తమ ప్రదర్శన చేసి 2023 ప్రపంచ కప్ టోర్నిని ఇక ఎంతో స్పెషల్ గా మార్చుకున్నారు ఇద్దరు ప్లేయర్లు. ఆ ఇద్దరు ఎవరో కాదు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్.. న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర.



 కెరియర్ ముగించాలి అనుకుంటున్న సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ క్వింటన్ డీ కాక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా నాలుగు సెంచరీలు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటకాలలో టాప్ 2 లో నిలిచాడు అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇక అతను కూడా వన్డే కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరి వరల్డ్ కప్ లో అతని ప్రదర్శన ఈ వరల్డ్ కప్ ను అతనికి ఎంతో స్పెషల్ గా మార్చేసింద. మొదటిసారి వన్ డే ప్రపంచ కప్ లో అడుగు పెట్టిన యంగ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏకంగా మూడు సెంచరీలు చేసి అదరగొట్టాడు. న్యూజిలాండ్ కూడా టోర్ని నుండి నిష్క్రమించింది.వరల్డ్ కప్ లోనే అద్భుతం ప్రదర్శన చేసి ఈ టోర్నిని ఎంతో స్పెషల్ గా మార్చుకున్నాడు. ఇలా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన వారి ప్రదర్శన మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: