కోహ్లీ బ్యాటింగ్ తో దీపావళి చూశాను.. ఫుట్ బాస్ స్టార్ కామెంట్స్?

praveen
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే లీక్ మ్యాచ్ లు ముగిసి సెమీఫైనల్ మ్యాచ్ లు కూడా ప్రారంభమయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో విజేతగా నిలిచే టీం ఎవరు అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో అటు న్యూజిలాండ్, టీమ్ ఇండియా జట్లు తలపడ్డాయి. సాధారణంగానే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది. ఇక ఇప్పుడు సెమీఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్లలో ఈ రెండు టీమ్స్ తలబడటంతో అందరిలో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.


 అయితే సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా ఇక న్యూజిలాండ్ పై విజయం సాధించింది. ఈ క్రమంలోనే 2019లో ఎలా అయితే న్యూజిలాండ్ తమను ఓడించి ఇంటికి పంపించిందో.. ఇక ఇప్పుడు ఇలా కివిస్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. అయితే ఇక ఈ మ్యాచ్ చూడడానికి అతిరథ మహారథులు అందరూ కూడా స్టేడియం కు తరలివచ్చారు అని చెప్పాలి. బాలీవుడ్ తారలతో పాటు ఇక ఎంతోమంది క్రికెట్ మాజీలు కూడా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించారు. ఈ క్రమంలోనే ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బేక్ హామ్ సైతం ఇక ఈ మ్యాచ్ చూడడానికి వచ్చారు.


 బిసిసిఐ సెక్రటరీ జైశా పక్కన కూర్చొని మ్యాచ్ వీక్షించారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సాధించిన 50వ వన్డే సెంచరీ గురించి ఈ ఫుట్బాల్ స్టార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సరైన సమయంలో ఇండియాలో ఉన్నాను. ఈరోజు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో నేను దీపావళిని చూసాను అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై ఇండియా గెలుస్తుందని.. ఆయన ముందుగానే జోష్యం చెప్పారు. కాగా సెంచరీ అనంతరం ఈ ఫుట్బాల్ స్టార్ స్వయంగా వెళ్లి విరాట్ కోహ్లీని కలిశారు. కాగా కోహ్లీ 50వ సెంచరీ ద్వారా క్రికెట్ దేవుడు సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: