ఐపీఎల్ వేలంలోకి.. ఆస్ట్రేలియా కెప్టెన్.. భారీ ధర ఖాయమా?
ఇక ఐపీఎల్ లో ఎవరైనా ఆటగాడు మంచి ప్రదర్శన చేశాడు అంటే చాలు అతని పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారి మోగిపోతూ ఉంటుంది అని చెప్పాలి. దీంతో మహామహా స్టార్ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లో పాల్గొనడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం గత కొంతకాలం నుంచి ఐపీఎల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మ్యాచ్లో ఆడటం కంటే దేశం తరఫున ఒక్క మ్యాచ్ ఆడటానికే తాము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము అంటూ గతంలో కొంతమంది ప్లేయర్లు వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి కామెంట్స్ చేసిన వారిలో పాట్ కమిన్స్ కూడా ఒకరు అని చెప్పాలి. కాగా ఐపీఎల్ 2024 వేలానికి తాను అందుబాటులో ఉంటాను అంటూ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. గత ఐపీఎల్ సీజన్ కు అతను దూరమయ్యాడు అని చెప్పాలి. ఇక మళ్ళీ 2024 ఐపీఎల్ సీజన్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొదటినుంచి ఈ ఆటగాడు ఐపీఎల్ పై పెద్దగా దృష్టి సారించి లేదు. ఇప్పటివరకు కేవలం 42 మ్యాచ్లు మాత్రమే ఆటాడు తనకు 100 ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం కన్నా.. ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ చాలా ముఖ్యం అంటూ గతంలో కామెంట్స్ కూడా చేశాడు. ఈ స్టార్ ప్లేయర్ వేలంలోకి వస్తే భారీ ధర పలికే అవకాశం ఉంది.