48 ఏళ్ళ వరల్డ్ కప్ హిస్టరీలో.. టీమిండియాకే ఇది సాధ్యమైంది?
కాగా ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లు అన్నింటిలో కూడా విజయం సాధించి సత్తాచాటింది అని చెప్పాలి నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టుతో జరిగిన మ్యాచ్లో 160 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు. అంతేకాదు ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ భాగం బ్యాటింగ్ విభాగం తేడా లేకుండా జట్టులోని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు సైతం బౌలింగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఇక భారత జట్టు టాప్ ఆర్డర్ మొత్తం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే ప్రపంచ కప్ చరిత్రలోనే టీమిండియా అదిరిపోయే రికార్డులు సాధించింది. ఏకంగా భారత జట్టు దెబ్బకి రికార్డులన్నీ కూడా గులాములు అయ్యాయి. 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో ఒక టీం తరఫున టాప్ ఫైవ్ ఆటగాళ్లు 50 కి పైగా స్కోర్ చేయడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 61, గిల్ 51, విరాట్ 51, శ్రేయస్ అయ్యర్ 128, కేఎల్ రాహుల్ 102 పరుగులు చేశారు. అంతే కాదు భారత్ తరపున వన్డే ఫార్మాట్లో టాప్ ఫైవ్ ప్లేయర్స్ 50 ప్లస్ స్కోర్ చేయడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పాలి. నవంబర్ 15వ తేదీన న్యూజిలాండ్ జట్టుతో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.