బుమ్రా నిజంగా తోపే.. ఈ గణాంకాలు చూడండి?

praveen
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో భారత ఫేసర్ బుమ్రా కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ఆటగాడిలాగా ఎంట్రీ ఇచ్చిన బుమ్రా తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా సెలెక్టర్ల చూపును ఆకర్షించి.. భారత జట్టులోకి కూడా వచ్చేసాడు. అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒత్తిడికి గురి కాకుండా ఇక తన ప్రతిభను నిరూపించుకొని.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి.


 ఇక టీమిండియాలో కీలక బౌలర్గా ఎదిగాడు. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ఎప్పుడు ప్రత్యర్ధులను బెంబెలెత్తిస్తు ఉంటాడు బుమ్రా. ఇక అదిరిపోయే ఆట తీరతో ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాడు. కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంటాడు. అంతేకాదు భారత జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నిలో కూడా అదరగొడుతున్నాడు. అయితే వికెట్ల పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ.. పరుగులు కట్టడి చేయడంలో మాత్రం తనను మించిన తోపు ఇంకెవరూ లేరు అని నిరూపిస్తున్నారు.


 ఫాస్ట్ బౌలర్ బుమ్రా తన బౌలింగ్ మాయాజాలంతో ప్రత్యర్థులను ఎలా వణికిస్తున్నాడో అన్నదానికి నిదర్శనంగా ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన గణాంకాలు వైరల్ గా మారిపోయాయి. ఇప్పుడు వరకు ఈ వరల్డ్ కప్ లో 383 బంతులు వేశాడు బుమ్రా. ఇందులో 268 బంతులు డాట్ బాల్స్ కావడం గమనార్హం. అంతేకాదు అతని బౌలింగ్లో ప్రత్యర్థులు కేవలం 21 ఫోర్లు ఐదు సిక్సర్లు మాత్రమే కొట్టారు. ఇక ఈ  టోర్నీలో అతని ఎకానమీ 3.65గా ఉంది. ఆడిన 8 మ్యాచ్లలో 15 వికెట్లు తీశాడు. అలాంటి బుమ్రా సెమి ఫైనల్లో భారత జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: