కోహ్లీ.. అలాంటి బంతులకు చాలా భయపడతాడట తెలుసా?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో మొదటి వరుసలో కొనసాగుతూ ఉన్నాడు. ఎప్పుడు తన ఆటతీరుతో అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోతుంది. ఇప్పటివరకు ఎంతోమంది లెజెండ్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను.. విరాట్ కోహ్లీ బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టించాడు. అయినప్పటికీ ఇంకా జట్టులోకి వచ్చి ఏదో నిరూపించుకోవాలి అనుకునే కొత్త ఆటగాడి లాగానే అతను ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 ఇక ప్రతి మ్యాచ్ లో కూడా 100 రెడ్ బుల్స్ ఒకటేసారి తాగేసాడేమో అనేంత ఎనర్జీతో బరిలోకి దిగుతూ ఉంటాడు. ఇలాంటి ఎనర్జీనే అటు కోహ్లీ ప్రత్యర్ధులు అందరిని  కూడా భయపెడుతూ ఉంటుంది. కనీసం కోహ్లీతో స్లెడ్జింగ్ చేయడానికి కూడా ప్రత్యర్ధులు భయపడతారు అంటే ఇక అతని ఆట తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి జంటకు విరుష్క  అంటూ ఒక నిక్ నేమ్ కూడా పెట్టేశారు అభిమానులు. అయితే ఇద్దరూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటారు  అయితే ఇటీవల విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేశాడు. ఇక ఈ సంభాషణలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కోహ్లీకి యార్కర్ అంటే భయమా? లేదంటే 150 స్పీడులో ఉన్న బౌన్సర్ అంటే భయమా అంటూ అనుష్క ప్రశ్నించింది. యార్కర్ అయితే డిఫెన్స్ ఆడొచ్చు. బౌన్సర్ అంటే భయం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక తనకు ఇష్టమైన ఫుడ్ బాల్ క్లబ్ మంచేస్టర్ సిటీ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: