టీవీల్లో కూర్చుని చెప్పడం కాదు.. డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి : బాబర్

praveen
2023 వన్డే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లో పాకిస్తాన్ జట్టు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఏకంగా దాయాది దేశమైన భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ లో సత్తా చాటాలని పాకిస్తాన్ ఎంతగానో ఆశపడింది. ఏకంగా భారత గడ్డపై వరల్డ్ కప్ గెలిస్తే ఇక అంతకుమించిన గౌరవం మరొకటి ఉండదు అని ఆశపడింది. కానీ ఊహించిన రీతిలో పాకిస్తాన్ కు నిరాశ ఎదురయింది అని చెప్పాలి. ఎక్కడ అనుకున్నా రీతిలో రాణించలేకపోయింది పాకిస్తాన్.

 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్తాన్.. ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలతో సతమతమైంది. ఏకంగావరుసగా నాలుగు ఓటములు చవిచూసి.. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. చిన్న టీమ్స్ చేతిలో సైతం ఓడిపోవడంతో పాకిస్తాన్ అన్ని జట్లతో పోల్చి చూస్తే వెనకబడిపోయింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై విజయం సాధించడంతో.. ఇక సెమి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది.

 అయితే ఇలా పాకిస్తాన్ ఫామ్ చూసి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. అయితే ఈ విమర్శలపై పాక్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీవీలో కూర్చుని పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కురిపిస్తున్న ఆ దేశ మాజీ క్రికెటర్ల పై మండిపడ్డాడు. టీవీలో కూర్చొని అభిప్రాయాలు చెప్పడం సులభం. ఎవరైనా సలహా ఇవ్వాలి అనుకుంటే నేరుగా నాకు కాల్ చేయండి. అలాంటివారు ఎంతమంది ఉన్న స్వాగతిస్తా. ఇక నా నెంబర్ కూడా అందరికీ తెలుసు. ప్లేయర్ల ఆట తీరిపై బహిరంగంగా విమర్శించడం మంచిది కాదు. గతంలో ఎన్నడు ఇలాంటిది చూడలేదు అంటూ బాబర్ వ్యాఖ్యానించాడు. ఇకపోతే నేడు ఇంగ్లాండ్ తో బాబర్ సేన డూ ఆర్ డై మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: