భారత జట్టును ఓడించాలంటే.. అదొక్కటే మార్గం : ఆసిస్ మాజీ

praveen
ప్రస్తుతం 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన జట్టు  అన్నింటిలో కూడా విజయం సాధించింది. ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉన్నా సరే అటు భారత జట్టు ప్రదర్శన ముందు డీల పడిపోతుంది అని చెప్పాలి. దీంతో ఇక ఈ వరల్డ్ ఎడిషన్ లో టీమిండియాని ఎదుర్కొనే జట్టు ఏదైనా ఉందా లేదా అనే అనుమానం కూడా అందరిలో కలుగుతుంది.


 అయితే ప్రత్యర్థి జట్లు టీమిండియాని ఓడించేందుకు ఎన్ని ప్రణాళికలతో బరిలోకి దిగినప్పటికీ.. ఇక భారత జట్టు ఫామ్ ముందు ప్రత్యర్థి ప్లాన్స్  అన్ని కూడా తారుమారు అవుతున్నాయి. దీంతో ఇక ప్రత్యర్ధులకు టీమిండియా చేతిలో ఓటమి తప్పడం లేదు అని చెప్పాలి  అయితే తర్వాత మ్యాచ్లో నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా.  ఇక సెమి ఫైనల్ లో హోరా హోరి పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాను ఓడించడానికి ఒక సలహా ఇచ్చాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం.



 వరుస విజయాలతో దూసుకు పోతూ సూపర్ ఫామ్ కనబరిస్తున్న టీమిండియాని ఓడించాలి అంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడం గిల్ క్రిస్ట్. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలి. అయితే చేజింగ్ లో భారత్ వీక్ కాదు. ఆ జట్టుకు కోహ్లీ లాంటి చేజర్లు ఉన్నారు. కానీ లైట్ ల కింద భారత బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం. ఇక వారి బౌలింగ్లో పరుగులు రాబట్టడం మరింత కష్టం. సిరాజ్, షమీ,  బూమ్రా బౌలింగ్ ను లైట్ల కింద ఆడటం కంటే పగటిపూట ఆడటం ఎంతో బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: