ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు మొదలవుతుందంటే?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే 2008లో ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపిఎల్.. ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా హవా నడిపిస్తుంది. ఇక ప్రపంచ స్థాయి ఆటగాళ్లందరూ  కూడా ఐపీఎల్ లో భాగం కావాలని.. అపారమైన అనుభవంతో పాటు ఆదాయం పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు.  దీంతో ప్రతి ఐపీఎల్ సీజన్ మిస్ అవ్వకుండా ఆడుతూ ఉంటారు అని చెప్పాలి.


 కొంతమంది అయితే అంతర్జాతీయ క్రికెట్ ను పక్కన పెట్టి మరి ఐపీఎల్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే అచ్చం ఐపీఎల్ తరహాలోనే మహిళా క్రికెట్ ను కూడా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న మహిళా ప్లేయర్ల ఇబ్బందులు తీరిపోయాయి   ఎందుకంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఎంతో మంది మహిళా ప్లేయర్లు కోట్ల రూపాయల ధర పలికారు. కాగా మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది.


 అయితే 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రస్తుతం అటు బీసీసీఐ కూడా సన్నాహాలు చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వచ్చేయడాది మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహణకు తేదీ ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి లీగ్ ప్రారంభమవుతుందని క్రీడా వర్గాల నుంచి సమాచారం. ముంబై, బెంగళూరులో మ్యాచ్ లు నిర్వహిస్తారట. ఈ ఏడాది ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి మంచి స్పందన వచ్చింది  దీంతో ఇక ఆ తర్వాత సీజన్ కూడా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది అన్నది తెలుస్తుంది. మరి రెండో సీజన్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl

సంబంధిత వార్తలు: