ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికాకు.. మరో బిగ్ షాక్?
భారత బౌలింగ్ విభాగం ముందు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విభాగం పేక మేడల కూలిపోయింది అని చెప్పాలి. దీంతో ఈ వరల్డ్ కప్ లో దారుణమైన పరాజయాన్ని చవిచూసి తీవ్ర నిరాశల్లో కూరుకుపోయింది సౌత్ ఆఫ్రికా జట్టు. అయితే ఇలా ఓటమిబాదిలో ఉన్న సౌతాఫ్రికా జట్టుకు ఇప్పుడు మూలగే నక్కపై తాటిపండు పడ్డ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఓటమి బాధలు నిరాశలో ఉన్న జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి. జట్టులో ఉన్న కీలక ఆటగాడు గాయం కారణంగా టీమ్ కు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతూ ఉన్నాడు లుంగీ ఎంగిడి. అయితే అతను కాలిగాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో అతను ప్రపంచ కప్ లోనే మిగతా మ్యాచ్ల నుంచి తప్పుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై అటు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అయితే అతని స్థానంలో ఇప్పటికే రిలీ రూసో భారత్ కూడా వచ్చాడట మరో ఫేసరు విలియమ్స్ అందుబాటులో ఉండడంతో.. ఇక బ్యాకప్ గా రూసోని జట్టులోకి తీసుకున్నారు అని తెలుస్తుంది నిజంగా ఎంగిడి లాంటి బౌలర్ దూరం కావడం మాత్రం సౌత్ ఆఫ్రికా కు భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి.