'టైమ్డ్ ఔట్' అంటే ఏంటీ.. ఈ రూల్ గురించి తెలుసా?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రూల్స్ ఉంటాయి. కానీ కొన్ని రూల్స్ మాత్రమే ప్రేక్షకులకు తెలిసి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులకు తెలిసిన రూల్స్ మాత్రమే అటు అంతర్జాతీయ క్రికెట్లో ఉన్నాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఆటగాడు సరికొత్త రూల్స్ ఉపయోగించి ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన సమయంలో అది కాస్త ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. గతంలో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇలాంటి కొత్త రూల్ ని అందరికీ తెలియజేశారు.


 ప్రపంచ క్రికెట్లో మన్ కడింగ్ అనే రూల్ ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ అశ్విన్ ఏకంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఇలా మన్ కడింగ్ రూల్స్ ద్వారా రన్ అవుట్ చేసి చివరికి ఈ రూల్ గురించి ప్రతి ఒక్కరు చర్చించుకునేలా చేశాడు. ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ నిబంధన  తెలిసిపోయింది.అయితే ఇక ఇప్పుడు మరో సరికొత్త రూల్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రూల్ ఇప్పటికే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కూడా. అదేంటంటే టైమ్డ్ ఔట్. ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్మెన్ మాథ్యూస్ ని   అంపైర్లు టైమ్డ్ ఔట్ విధానంలో ఔట్ ప్రకటించారు.


 దీంతో ఈ రూల్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ క్రికెట్ లో టైమ్డ్ ఔట్ అంటే ఏమిటంటే.. క్రీజులో ఉన్న బ్యాటర్ అవుట్ అయిన వెంటనే నిర్ణీత సమయంలోగా తర్వాత బ్యాటర్ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్లో ఆ సమయం మూడు నిమిషాలుగా ఉండేది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ నిబంధనలో ఆ గడువును కేవలం రెండు నిమిషాలకు తగ్గించారు. దీంతో ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత మరో బ్యాట్స్మెన్ రెండు నిమిషాల్లోగా మైదానంలోకి వచ్చి తర్వాత బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలోపు బ్యాటర్ రాకపోతే దానిని టైం అవుట్ గా ప్రకటించడం చేస్తూ ఉంటారు ఫీల్డ్ ఎంపైర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: