వరల్డ్ కప్ నుండి.. మరో టీం ఎలిమినేటెడ్?
అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో పోరు సెమీఫైనల్‌కు చేరుకున్న నేపథ్యంలో.. 10 టీమ్స్ లలో కేవలం నాలుగు టీమ్స్ మాత్రమే అటు సెమిస్లు అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లు సెమి ఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. దీంతో మరో రెండు టీమ్స్ కి మాత్రమే సేమిస్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. దీంతో ఇక ఈ రెండు స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇకపోతే ఇటీవల టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన మరో టీం కూడా చివరికి వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించింది.
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో దారుణ పరాజయం పాలయింది. దీంతో శ్రీలంక ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి ఇక వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్ కూడా ఇప్పటికే వరల్డ్ కప్ టోర్న నుంచి నిష్క్రమించడం గమనార్హం. అదే సమయంలో ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా ఈ వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా చెత్త రికార్డు మూట గట్టుకుంది.