విజయానందంలో ఉన్న పాకిస్తాన్ కు.. షాక్ ఇచ్చిన ఐసీసీ?
ఇక ఇందులో చిన్న జట్ల చేతిలో కూడా పాకిస్తాన్ పరాజయం పాలయింది అని చెప్పాలి. దీంతో పాకిస్తాన్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత పుంజుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. అదృష్టం కలిసి వచ్చి విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇలా పాకిస్తాన్ వరుస విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఇక సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ రేస్ లో ముందుకు సాగుతూ ఉంది. అయితే ఇలా న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుతో జరిగిన మ్యాచ్ లో వర్షం రూపంలో అదృష్టం కలిసి రావడంతో గెలిచిన పాకిస్తాన్ కు అటు ఐసీసీ మాత్రం ఊహించిన షాక్ ఇచ్చింది
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆ జట్టుకు జరిమానా విధించేందుకు నిర్ణయించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మ్యాచ్ ఫీజులో పది శాతం జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇలా విజయం సాధించాము అన్న సంతోషంలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఈ జరిమానాతో ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగులు తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది.