కెన్ విలియమ్సన్ అరుదైన రికార్డు.. కివీస్ నుండి ఒకే ఒక్కడు?
వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో కూడా ఎలా చిరునవ్వు చిందించగలుగుతున్నాడు. నిజంగా అతను ఎంతో ప్రత్యేకం అని అందరూ భావించడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ప్రపంచ క్రికెట్లో విలియంసన్ ఏం చేస్తున్నా కూడా అందరూ గమనించటం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న 2023 వరల్డ్ కప్ లో కూడా కెన్ విలియమ్సన్ గత కొంతకాలం నుంచి జట్టుకు దూరంగానే ఉన్నాడు.
ఈ క్రమంలోనే అతనికి డిప్యూటీ అయిన టామ్ లాథం కెప్టెన్సీలో న్యూజిలాండ్ వరుస విజయాలు సాధించింది. అయితే ఇటీవల విలియంసన్ మళ్లీ కోలుకుని జట్టులో చేరాడు. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో రావడం రావడమే 95 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ జట్టు తరఫున వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. 24 ఇన్నింగ్స్ లలో విలియమ్సన్ 1084 పరుగులు చేశాడు. ఇక తర్వాత స్థానంలో ఫ్లెమింగ్ 1075 రన్స్, టేలర్ 1002 పరుగులతో ఉన్నారు. కాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు భారీ పరుగులు చేసినప్పటికీ ఇక వర్షం కారణంగా పాకిస్తాన్ కి అదృష్టం కలిసి వచ్చి విజయం సాధించింది అని చెప్పాలి.