భారత క్రికెట్ హిస్టరీలో.. అయ్యర్ అద్భుత రికార్డు?
అయితే అతను సరిగ్గా ఆడటం లేదు అంటూ వస్తున్న విమర్శలు అతని కంటపడ్డాయో లేదా ఇంకేం జరిగిందో కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. 146.4 3 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 51 బంతుల్లోనే 88 పరుగులు చేసి అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే జట్టుకు భారీ స్కోరు అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు అని చెప్పాలి. అయితే శ్రేయస్ అయ్యర్ ఇలా హాఫ్ సెంచరీలతో రాణించడమే కాదు ఒక అరుదైన రికార్డును కూడా సాధించాడు. అత్యంత తక్కువ సమయంలోనే 2000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్ ద్వారా ఈ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత తక్కువ మ్యాచ్ల లోనే 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 49 మ్యాచుల్లోనే అతను ఈ ఘనత అందుకోగా.. ఇక ఈ లిస్టులో తొలి స్థానంలో టీమిండియా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ ఉన్నాడు. 38 మ్యాచ్లలోనే గిల్ ఇలా 2000 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 48 మ్యాచ్లలో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా ఉన్నాడు. ఇక అయ్యర్ తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్దు, సౌరబ్ గంగూలీ 52 మ్యాచ్లలో ఈ ఘనత సాధించిన ప్లేయర్లుగా ఉన్నారు. గగ శ్రీలంకతో మ్యాచ్లో టీం ఇండియా 32 పరుగులు తేడాతో భారీ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలుస్తుంది.