అల్లుడిని కాదని.. కోహ్లీకి ఓటేసిన బాలీవుడ్ హీరో?
కర్ణాటక కు చెందిన సునీల్ శెట్టి బాలీవుడ్లో నటుడుగా స్థిరపడ్డాడు. ఇక స్టార్ యాక్టర్ గా ఒకానొక సమయంలో హవా నడిపించాడు. ఇక ఇప్పుడు ఎంతోమంది సార్ హీరోల సినిమాలో కీలక పాత్రలు నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే తన అల్లుడు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ను కాదని విరాట్ కోహ్లీనే తన ఫేవరెట్ అంటూ చెప్పాడు. కాగా కేల్ రాహుల్ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే మనీ కంట్రోల్ సమ్మిట్ లో పాల్గొన్న సునీల్ శెట్టి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన అభిమాన క్రికెటర్ ఎవరు అని అడగగానే.. విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు సునీల్ శెట్టి. అదే సమయంలో తన అల్లుడు కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే కచ్చితంగా విరాట్ కోహ్లీ పేరు చెబుతాను. కేఎల్ రాహుల్ నా కుమారుడు. నా కుటుంబ సభ్యులు గురించి నేను పొగిడితే బాగుండదు కదా. నిజానికి నేను జాతీయ జట్టుకు ఆడాలనుకున్నాను. నా అల్లుడు రూపంలో ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది అంటూ సునీల్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఏదేమైనా చేజింగ్ మాస్టర్ కాబట్టే కోహ్లీ నా అభిమాన క్రికెటర్ అయ్యాడు అంటూ సునీల్ శెట్టి సమాధానం చెప్పాడు.