రోహిత్ ముందు అత్యంత అరుదైన రికార్డు.. మరో 47 పరుగులు చేస్తే?
ఓపెనర్ గా బరిలోకి దిగుతూ భారత జట్టుకు ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ఆరంభాలను అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి అయితే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ ముందు ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది.. రేపు ఇంగ్లాండుతో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ మరో 47 పరుగులు చేశాడు అంటే చాలు తన పేరిట ఒక ప్రత్యేకమైన రికార్డు వచ్చి చేరుతుంది. అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మార్కును అందుకుంటాడు రోహిత్. అయితే ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్ లలో రోహిత్ ఫామ్ చూసుకుంటే ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్లో ఎంతో సులభంగా 47 పరుగులు చేయగలడు అని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు.
కాగా 450 అంతర్జాతీయ మ్యాచ్ లలో 43.96 సగటుతో 17,953 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అందులో 45 సెంచరీలు, 98 ఆర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక రోహిత్ బ్యాట్ నుంచి 1703 ఫోర్లు, 568 సిక్సర్లు కూడా వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు కేవలం నలుగురు భారత బ్యాట్స్మెన్లు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మార్కులు అందుకున్నారు. రోహిత్ శర్మ ఇప్పుడు ఆ రికార్డు సాధిస్తే ఐదో భారత బ్యాట్స్మెన్ గా అవతరించబోతున్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరబ్ గంగూలీ మాత్రమే 18వేల పరుగుల మార్క్ అందుకున్నారు అని చెప్పాలి.