కర్మఫలం అనుభవించక తప్పదు.. అందుకే ఇంగ్లాండుకు ఈ పరిస్థితి?

praveen
ఒకవైపు డిపెండింగ్ ఛాంపియన్ అనే హోదా.. ఇంకోవైపు వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీం అనే ట్యాగ్.. మరోవైపు టైటిల్ ఫేవరెట్ అనే అంచనా.. ఇలా భారీ అంచనాల మధ్య ఇంగ్లాండ్ టీం 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా బరిలోకి దిగింది. కానీ ఇంగ్లాండ్ ప్రస్థానం మొదలైన తర్వాత మాత్రం అందరి అంచనాలు తారుమారు అయిపోయాయ్. డిపెండింగ్ ఛాంపియన్ పటిష్టమైన జట్టు అయిన ఇంగ్లాండు ఎక్కడ సత్తా చాట లేక పోతుంది. వరుస పరాజయాలతో సతమతమవుతుంది అని చెప్పాలి.


 ఇక ఇంగ్లాండ్ జట్టును ఎంతలా బ్యాడ్ లక్ వేధిస్తుంది అంటే ఎలాంటి అంచనాలు లేని పసికూన జట్లు సైతం దారుణంగా ఇంగ్లాండ్ ను ఓడించి చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నాయి అని చెప్పాలి. దీంతో  ఏ ఒక్క మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ గెలుస్తుంది అన్న నమ్మకం సొంత ఫ్యాన్స్ కి కూడా లేకుండా పోయింది. అయితే ఇదంతా జరగడానికి కారణం కర్మఫలమే అని అంటున్నారు కొంతమంది నేటిజన్స్. చెడు కర్మలకు ప్రతిఫలం అనుభవించాల్సిందే అన్నది కర్మ సిద్ధాంతం  ఇక ఇప్పుడు ఇంగ్లాండు టీం కూడా కర్మ ఫలాన్ని అనుభవిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.



 వరల్డ్ కప్ లో భాగంగా ఐదు మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు.  కేవలం ఒకే ఒక విజయాన్ని సాధించింది. అయితే ఇదంతా జరగడానికి 2019 కర్మ ఫలమె ఇప్పుడు ఇంగ్లాండ్ అనుభవిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. 2019లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో  ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు 50 ఓవర్ల ఆటతో పాటు సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమయ్యాయి. అయితే బౌండరీల పరంగా న్యూజిలాండ్ కంటే ఇంగ్లాండ్ కే ఎక్కువ ఉన్నాయని ఇంగ్లీష్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు  గతంలో దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయ్. ఇంగ్లాండ్ తొండి చేసిందని ఎన్నో వాదనలు వినిపించాయి  అయితే ఇప్పుడు భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శనకు నాటి కర్మ ఫలితమే కారణమని ఎంతో మంది నేటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: