టీమిండియా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్?

praveen


వన్డే ప్రపంచకప్ 2023 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా అదిరిపోయే పర్ఫామెన్స్ తో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో టీమ్ ఇండియా భారీ విజయాలను నమోదు చేసింది. తన తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ అక్టోబర్ 29 ఆదివారం లక్నోలో జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్‌పై తాము విజయం సాధించడం ఖాయమనే విశ్వాసంతో టీమిండియా ఉంది. టోర్నీలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను టీమిండియా ఓడించింది.

అయితే, టీమ్ ఇండియాకు ఒక ఆందోళన ఉంది: అదే ఆరో బౌలింగ్ ఆప్షన్. మిడిల్ ఓవర్లలో పేసర్ గా రాణిస్తున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చీలమండకు గాయమై న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతను ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చికిత్స పొందుతున్నాడు.

హార్దిక్ పాండ్యా లేకుండా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా కేవలం ఐదుగురు బౌలర్లతో ఆడింది. వారు షమీ, సూర్య, బుమ్రా, జడేజా, చాహల్. ఈ ఐదుగురు బౌలర్లు న్యూజిలాండ్ ఆటగాళ్లను కట్టడి చేయలేకపోయారు. న్యూజిలాండ్ ప్లేయర్స్ 50 ఓవర్లలో సునాయాసంగా 287 పరుగులు చేయగలిగారు. అంటే అంచనాలకు మించి వారు పరుగులు తీయగలిగారు. హార్థిక్ పాండ్యా లేకపోతే ప్రత్యర్థుల టీమ్ ను తక్కువ పరుగులకు నిరోధించలేము అని ఈ మ్యాచ్ తో తేలింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లతో రాణించడంతో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒకవేళ అతడు కూడా ఫెయిల్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

 ఇలాంటి పరిస్థితులలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిట్‌గా తయారవ్వాలని నెక్స్ట్ మ్యాచ్‌లో ఆడాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే తాజాగా  బీసీసీఐ వర్గాలు ఆ అభిమానులకు ఒక శుభవార్త చెప్పాయి. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడని, అతని స్థానంలో జట్టులోకి మరొకరిని తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశాయి.

ఇకపోతే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వారం రోజుల విరామం దొరికింది. దసరా పండుగ కావడంతో భారత ఆటగాళ్లకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, న్యూజిలాండ్‌పై విజయం తర్వాత, భారత ఆటగాళ్లందరూ ధర్మశాలలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి వెళ్లడం కంటే ధర్మశాలలోనే ఉండి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడమే మంచిదని క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: