ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాల వెనక.. ఉన్నది మన భారతీయుడేనట?
అయితే ఇలా ఆఫ్గనిస్తాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయుడు ఎవరో కాదు ఒకప్పటి టీమ్ ఇండియా ఆల్ రౌండర్ జడేజా. అదేనండి అజయ్ జడేజా. ప్రస్తుతం అజయ్ జడేజా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి మెంటర్గా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టును విజయతీరాలకు చేర్చడంలో తనవంతు కృషి చేస్తున్నాడు. దీంతో చిన్న టీం గా వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన ఆప్కానిస్తాన్ ఎన్నో సంచలన విజయాలను నమోదు చేస్తుంది పసికూనల కాదు ఏకంగా కసి కూనల ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.
గతంలో ఇంగ్లాండు పై సంచలన విజయాన్ని నమోదు చేసింది ఆఫ్గనిస్తాన్. ఏకంగా 69 పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. ఇక ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్లను దాటిగా ఎదుర్కొని 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం రెండు వికెట్స్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ హిస్టరీలో పాకిస్తాన్ ను తొలిసారి ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్.