ఛేజింగ్ లో.. కోహ్లీ ని మించిన తోపు లేడు : వాట్సాన్
ఒకవైపు వికెట్ను కాపాడుకుంటూనే మరోవైపు ఇక జట్టును గెలిపించేందుకు భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది అని చెప్పాలి. అయితే చేజింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఒత్తిడికి ఎంతోమంది వికెట్ కోల్పోతూ ఉంటారు కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం చేజింగ్లో తమకు తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంటారు. అలాంటి ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు అని చెప్పాలి. అందరూ చేజింగ్ ఒత్తిడి అని చెబుతుంటే.. తనకు మాత్రం ఛేజింగ్ ఇష్టం అని చెబుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఛేజింగ్ ఉంది అంటే చాలు మరింత దూకుడుగా ఆడుతూ భారీగా స్కోర్ నమోదు చేయడం చేస్తూ ఉంటాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షైన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఛేజింగ్ చాలా కష్టమని అందరూ అనుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం దాన్ని సులభతరం చేస్తాడు అంటూ షేన్ వాట్సన్ తెలిపాడు. ఇదే పనిని అతను కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నాడు అంటూ ప్రశంసించాడు. అయితే కోహ్లీ చాలా గొప్పగా ఆటను అర్థం చేసుకుంటాడని.. అతను ఒక ఇంటర్నల్ కంప్యూటర్ అని పేర్కొన్నాడు వాట్సన్. ఇక విరాట్ ఆట అందంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ చేజింగ్ సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ఏకంగా 95 పరుగులు చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.