భారత క్రికెట్ చరిత్రలో.. అది అత్యంత చెత్త సెలక్షన్ కమిటీ : గంభీర్
అయితే వరల్డ్ కప్ కోసం సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించిన వెంటనే అంబటి రాయుడు.. సెలక్షన్ కమిటీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.. ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి కూడా చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పట్లో ఇలా ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీవ్ర విమర్శల పాలైంది. అయితే ఇటీవల ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ లో కామెంట్రీ చేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇక అప్పటి సెలక్షన్ కమిటీ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అంబటి రాయుడు ఒక అద్భుతమైన ఆటగాడు అంటూ కితాబు ఇచ్చాడు గౌతమ్ గంభీర్.
నెంబర్ ఫోర్ స్థానంలో అతను అద్భుతంగా రాణించాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతడిని ప్రపంచకప్ కు ఎంపీగా చేయకపోవడం నిజంగా దారుణం అంటూ గంభీర్ అభిప్రాయపడ్డాడు. అతడి స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చారు. నాలుగో స్థానంలో సమస్య ఉన్నప్పటికీ ఇలా చేయడం తగదు. ఆ స్థానంలో అతడిని దాదాపు ఏడాది పాటు ఆడించారు. తీరా ప్రపంచ కప్ వచ్చేసరికి అతన్ని జట్టు నుంచి తప్పించారు. ఇందుకు కారణాలు ఏంటో ఎవరికి తెలియదు. అయితే ఇక నా జీవితంలో నేను చూసిన అత్యంత చెత్త సెలెక్షన్ కమిటీ ఎమ్మెస్ కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీనే అంటూ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా 2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్ సెమి ఫైనల్ లో ఓడిపోయి ఇంటికి వచ్చేసింది.