ఘోర పరాజయం.. ఇంగ్లాండ్ చెత్త రికార్డ్?

praveen
అసలు ఇంగ్లాండ్ జట్టుకు ఏమైంది. ఈసారి టైటిల్ గెలిచి వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని అనుకుంటే.. ఇలా ఆడుతుంది ఏంటి? 2019లో విశ్వవిజేతగా నిలిచిన జట్టు మరోసారి అదే రిపీట్ చేస్తుందనుకుంటే ఇలా అంచనాలను తారుమారు చేస్తుంది ఏంటి..? అసలు నిజంగా అక్కడ ఆడుతుంది ఇంగ్లాండు జట్టేనా  ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు ఈ వరల్డ్ కప్ లో అంత దారుణమైన ప్రదర్శన చేస్తుంది.


 2019 వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్ టీం.. 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం ఎక్కడ అంచనాలను అందుకునే ప్రదర్శన చేయడం లేదు. జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్న దారుణమైన ఓటములు చవిచూస్తూ.. ఇక తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో అయితే కనీసం పోటీ ఇవ్వలేకపోయింది ఇంగ్లాండ్. ఏకంగా 229 పరుగుల తేడాతో ఓడిపోయింది. 400 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండు.. బ్యాటింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది.


 దీంతో అటు పాయింట్లు పట్టికలో కూడా చివరి స్థానానికి పడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 249 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్.. ఒక చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. వన్డే ఫార్మాట్లో ఇంగ్లాండ్కు ఇదే అతిపెద్ద ఓటమి అని చెప్పాలి  కాగా వరల్డ్ కప్ 2023 పాయింట్స్ టేబుల్ లో ఆ జట్టు 9వ స్థానానికి పడిపోయింది. అయితే ఐసీసీ ఫుల్ మెంబర్షిప్ హోదా కలిగిన జట్టుగా కొనసాగుతూ అత్యధిక పరుగులు తేడాతో ఓడిపోయిన రెండవ జట్టుగా నిలిచింది ఇంగ్లాండ్. ఈ లిస్టులో వెస్టిండీస్ మొదటి స్థానంలో ఉంది. 2015లో సౌత్ ఆఫ్రికా చేతిలో 257 పరుగుల తేడాతో ఓడిపోయింది వెస్టిండీస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: